BUTCHER OF LA CABANA

నిన్న నా పాత కమ్యూనిస్ట్ మిత్రుడు పంపిన ఫోటో ఇది, ఆయన పంపిన ఉద్దేశ్యం ఏమిటో ఎందుకు పంపాడో కూడా నేను అడగదలచుకోలేదు. ఎందుకంటే అడిగితే నేను మాజీని కాబట్టి నా మీద సవాలక్ష నిందలు వేసి ఎదో ఒక సంఘానికో, పార్టీ కో అంటగడతారు ఈ కమ్యూనిస్టులు కాబట్టి.

సరే ఇక విషయానికి వస్తే సాయుధ విప్లవం తరహా పోరాటయోధులలో చే నిజంగానే ఒక స్ఫూర్తిదాయక పోరు చేసాడు . అందులో అనుమానం లేదు. కేవలం తనవారికోసమే కాకుండా క్యూబా నుండి మొదలైన ప్రయాణం బొలివియా లో చావుతో ముగిసింది.. దీనికి ఎలాంటి అనుమానం లేదు.

ఇక పైన చెప్పిన విషయానికి వస్తే, అసలు ఇది ఆయన ఎప్పుడు, ఎక్కడ చెప్పాడో తెలిస్తే బావుండేది.. ఎందుకంటే క్యూబా లో చెప్పాడా లేక బొలివియా లో చెప్పాడా అన్నది స్పష్టంగా లేదు. లేదు కొందరి వ్యక్తిగత అభిప్రాయలు ఆయన మీద రుద్ది ఆయన పేరు రాసి ఉండే అవకాశం కూడా ఉంది.

ఒకవేళ ఈ మాట ఆయనే చెప్పాడు అనుకుంటే క్యూబా లో చెప్పి ఉండాలి, క్యూబా లో చెప్పి ఉంటే, చేతిలో అధికారం ఉండి కూడా దాన్ని వదిలేసి తనకు నచ్చిన సాయుధ పోరాటం వైపుగా ప్రయాణం కొనసాగించిన వాడిని ఏమనాలి, తాను చెప్పిన మాట మీద తానే నిలబడలేదు. మార్క్సిజం చదివి ఉంటే అధికారం తన చేతిలో ఉన్నప్పుడు సోషలిజం గురించి తానే పాటించి చూపించేవాడు, నీతులు ఎదుటివారికి చెప్పి తాను మాత్రం తనకు నచ్చిన దారి ఎన్నుకునే రకం అనుకోవాలా ?

అయినా వ్యక్తి సంఘ జీవిగా ఆలోచించడం మంచిదే, కాకపోతే వ్యక్తిగతంగా ఆలోచించడం నేరమని చెప్పడమే నేరం. సామాజిక బాధ్యతతో ఆలోచించడం అంటే ప్రతి వ్యక్తి అవసరాలు తీరేలా ఉంచడం, అప్పుడు ఆ వ్యక్తి అవసరం వ్యక్తిగతమే అవుతుంది కానీ అది నేరమెలా అవుతుంది. సో పైన చెప్పిన స్టేట్మెంట్ భయపెట్టేలా ఉంది కానీ స్ఫూర్తి నిచ్చేది లా లేదు. ఇలాంటి వ్యక్తి ని ఎలా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి.

తన కసాయితనం గురించి కబనా లో మాట్లాడుకునే మాటలు వింటే అర్థం అవుతుంది, పసిపిల్లలు అని కూడా చూడకుండా వారిని తుపాకీతో కాల్చి చంపినా ధీరుడు ఈ వీరుడు అందుకే ఈయన్ని “Butcher of La Cabana” అని పిలుస్తారు… ల కబానా కసాయివాడు అని పేరు తెచ్చుకున్న ఈ ధీరుడు కమ్యూనిస్టులకు ఆదర్శప్రాయుడు. నిజానికి కమ్యూనిజమే రక్తపాత ధోరణి లో ఉన్నప్పుడు ఇలాంటి చే లు మావో లు వీరికి ఆరాద్యులే అవుతారు కానీ మరొకటి కాదు.

బొలివియా లో ఈయన్ని ప్రజలు ఈ కసాయి వాడిని చూసి ఎలా ఈసడించుకొని ఆహరం ఇవ్వకుండా గ్రామాల్లోకి రానివ్వలేదో ఆ వైనాన్ని ఈయనే తన డైరీ లో రాసుకున్న విషయాలు మాత్రం బయటకు చెప్పరు .. “బొలివియా డైరీ” అనే పుస్తకం లో ఆ వివరాలు కూడా రాసి ఉన్నాయి.

ఈయన క్యూబా నుండి బొలీవియా కు వెళ్లడం వెనక సంఘశ్రేయస్సు కన్నా తన కసాయి తనాన్ని చాటుకునే దృక్కోణమే ముఖ్య పాత్ర పోషించింది అన్నది చరిత్రకారుల వాదన.

అలాంటి కసాయి వాడిని మన దేశంలో కమ్యూనిస్టులు ఒక హీరో గా చిత్రీకరించడం చూస్తుంటే, కమ్యూనిజానికి అసలు రూపమైన రక్తసిక్త చరిత్రలు, మారణహోమాలకు ప్రతీక గా ఈయన్ని చూపిస్తున్నారని అని చెప్పుకోవాల్సి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *