క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా

క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీసీపీ).
ఇది కమ్యూనిస్ట్ పార్టీల అంతిమ ఉద్దేశ్యం. పెట్టుబడిదారులకు పరమ వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీ అంతిమ ఘట్టం సీసీపీ అన్నట్లు మారిపోయింది.
నిజానికి వీళ్ళిద్దరిదీ విడదీయరాని సంబంధం కాకపోతే వైరి వర్గాలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకే వర్గం అయ్యింది అంతే తేడా.

నిజానికి పెట్టుబడిదారుడు లేకపోతే కమ్యూనిజానికి అర్థమే లేదు, ఎందుకంటే వీళ్ళు బ్రతికేది వారిని అడ్డం పెట్టుకొని మాత్రమే కదా. ఒకప్పుడు సోషలిజం స్థాపనకు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అడ్డం అని వాదించిన నోర్లు, నేడు వారే సోషలిజం స్థాపనలో ముందున్నారని చెప్పడం ఎలాంటి సిద్ధాంతమో వాళ్ళే చెప్పాలి.
నిజంగా ఇప్పుడు మార్క్స్ బ్రతికి ఉంటే ఉరేసుకొని చనిపోయేవాడు ఈ నయా క్యాపిటలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీని చూసి.

అలీబాబా వ్యవస్థాపకుణ్ణి అంతలా పొగడాల్సిన అవసరం, స్థిరాస్తి రంగంలో అత్యంత సంపన్నుడిగా ఉన్న గ్జు జియాన్ ని, వాండా గ్రూప్ వ్యవస్థాపకుడు వాంగ్ జియాన్‌లిన్‌తోపాటు అనేకమంది వందల కోట్ల ఆస్తుల అధిపతులను తమ పార్టీ సభ్యులుగా పేర్కొంటూ వారు సోషలిజానికి ఎనలేని కృషి చేశారు అని చెప్పడం చూస్తుంటే మారిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కనపడుతుంది.

మరి మన దేశ కమ్యూనిస్టులు దారం తెగిన పతంగులలా ఉంటారో ఎదో ఒక దారానికి అంటుకొని తమ చైర్మన్ చైనా అడుగుజాడల్లో నడుస్తారో వేచి చూడాల్సిందే
(అయినా మన దగ్గర వాళ్లలో వాళ్ళకే లేని ఐక్యత ఇక సిద్ధాంతపరంగా ఏదైనా ఉంటుందా అనేది కూడా వెతకడం కష్టం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *