కమ్యూనిజం – వక్రీకరణ సిద్ధాంతాలు

Communism

 

 

కొందరికి కమ్యూనిజం నరనరాల్లో ఇంకిపోవడానికి 90 ఏళ్లుగా వాళ్ళ సిద్ధాంతం పేరుతో ఆ పార్టీ చేస్తున్న వక్రీకరణలు, దాడులే కారణమని ఎంత మందికి తెలుసు.

నిజానికి కమ్యూనిజం సోషలిజం పేరుతో ఇండియా లో ప్రవేశించినా కూడా, దాని స్థాపన దిశగా కంటే కూడా.. ప్రజల్లో తన వక్రీకరణలు చొప్పించడానికి చేసిన ప్రయత్నాలే ఎక్కువ అని చెప్పొచ్చు.
దానికి వారు ఎన్నుకున్న మార్గాలు ఎన్నైనా కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొన్ని, అందులో మొదటిది ఇక్కడ ఎన్నికల్లో విదేశీ నిధుల ప్రవాహం పారించడం మొదటిది.
మీకు ఎవరికైనా తెలుసా అసలు పేద ప్రజల పార్టీ అని డబ్బాలు కొట్టుకునే కమ్యూనిస్ట్ పార్టీ ఏ మొదటగా దేశంలో విదేశీ నిధులను ఎన్నికల్లో వాడింది అని, ఇక్కడి ప్రజలు వీరి కుయుక్తులు పసిగట్టి ప్రోత్సాహం అందించని కారణంగా బయట నుండి నిధులు కావాలని తమ విదేశీ ఛైర్మన్స్ ని అడిగి మరీ డబ్బుల ప్రవాహం ఎన్నికల్లో పారించింది అన్న విషయం ఎంతమందికి తెలుసు.

ఇక రెండవది సాహిత్య దోపిడీ/వక్రీకరణలు, వీరి డబ్బుల ప్రవాహం ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపకపోయేసరికి వీరు ఎన్నుకున్న ఇంకో అస్త్రం, భారత దేశంలో తరతరాలుగా వస్తున్న చరిత్ర ను వక్రీకరించి పుస్తకాలు రాయడం లో మొదలుపెట్టారు, అనేకానేక అంశాలపైన తమ రకమైన భావజాలం గుప్పించే విధంగా పుస్తకాలు రాయడం వాటిని మార్కెట్లో విడుదల చెయ్యడం మొదలెట్టారు. వారి అలాంటి పరంపర లో వచ్చినవే కొందరు ముసుగు అభ్యుదయ వాదుల పేరుతో రాసిన విషవృక్షాలు, (విచిత్రం ఇదే విషవృక్షం రాసిన అభ్యుదయవాది, స్టాలిన్ మీద పుస్తకం రాస్తే మాత్రం ఒప్పుకోలేదు, పడక్కుర్చీ వాదనలు అని కొట్టిపారేశారు హిపోక్రాట్స్ ). సోషలిజం, కమ్యూనిజం పేరుతో కేవలం ఒక మతాన్ని మాత్రమే వ్యతిరేకించడం అంటేనే కమ్యూనిజం అనే విధంగా ముసుగు అభ్యుదయ రచనలు చేశారు. ఇలా దొరికిన ప్రతి సాహిత్యం మీద తమ మార్కు కుయుక్తులు రాసి ప్రజలను మభ్యపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ఇక మూడవది సామాజిక దోపిడీ, కమ్యూనిస్టులకు కులం లేదు, మతం లేదు, దేవుడు లేడు అని గొప్పలు చెప్తూ, కేవలం కొన్ని కులాల వారిని మాత్రమే అందలం ఎక్కించి, తమ జెండా మోసే సామాన్యుడు మట్టుకు ఎప్పుడు జెండా మాత్రమే మోసేవిధంగా జాగ్రత్త పడ్డారు, అభ్యుదయం పేరుతో , చందాల పేరుతో వారిని పీల్చి పిప్పి చేసి, తాము మాత్రం దోపిడీ కి తెగబడ్డారు. (కార్ల్ మార్క్స్ వీధీ లోని భవనాలు ఎవరివో మాత్రం నాకు తెలియదు ).
అంతెందుకు వీళ్ళు సుందరయ్య గారి పేరు మీద కట్టిన సుందరయ్య విజ్ఞాన భవన్ లో ఏసీ లు వాడి ప్రత్యేక సమావేశ మందిరాలు నిర్మించారు కానీ అదే భవన్ వెనకాల ఉన్న గుడిసె వాసులను మట్టుకు పట్టించుకునే తీరిక లేదు వీళ్ళకి.

భూఅక్రమణల పేరిట వీళ్ళు సాగించే వ్యాపారం కబ్జాకోరుల దగ్గర కూడా మామూళ్లు వసూలు చేసే స్థాయి కి పెరిగింది. దీనికి వీళ్ళు ఉపయోగించుకునే ఒకే ఒక్క ఆయుధం, వీళ్ళ జెండాలు మోయడానికి వచ్చే సామాన్యులే, ఏదైనా గొడవ జరిగితే వాళ్ళను ముందు పెట్టడం, తాము వెనకుండి నడిపించడం, పోతే సామాన్యుల ప్రాణాలే కదా. ముందుగా వాళ్ళతో గుడిసెలు వేయించడం, జెండాలు పాతించడం… ఆనక యజమాని దగ్గర డబ్బులు వసూలు చేసి తోక జాడించడం. ఈ విషయం తెలియని ఆ సామాన్యులు అక్కడే గుడిసెల్లో ఉండటం, తీరా స్థల యజమాని రాత్రికి రాత్రి వీళ్ళ గుడిసెలు కూలదోసి వీరిని నది రోడ్డుమీదకు తోలడం… ఇది వీరి సామాజిక దోపిడీ.
ఇక మతం లేదు అన్నవాళ్ళు కేవలం ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చెయ్యడం ఇంకో ముఖ్య అంశం, వీరికి హిందువులకు, హిందుత్వ కు తేడా తెలియకపోవడం, హిందుత్వ ని వ్యతిరేకించే సాకుతో మొత్తం ఒక మతాన్ని మాత్రమే వ్యతిరేకించడం అలవాటు.. అలవాటు అని కూడా చెప్పలేము కావాలనే చేస్తారేమో (చివరికి వాళ్ళు చేరేది మట్టుకు అదే గుడి కి మన నారాయణ, గద్దర్ లాంటి వాళ్ళను చూసి ). ఇది ఏ రకమైన అలవాటో వాళ్ళే చెప్పాలి.

నాలుగవది శారీరక దాడి, అవతలివారిని భయపెట్టి, భయభ్రాంతులను చేసి అయినా సరే కమ్యూనిజాన్ని ప్రజల్లో చొప్పించాలి అన్న మార్క్స్ సిద్ధాంతం వీరికి ఆచరణీయం కదా. అందుకే ఒకవేళ తమ సిద్ధాంతం ఒప్పుకొని తమతో పని చెయ్యకపోతే ఎంతకైనా తెగించే మనస్తత్వం తో ఐసిస్ తీవ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తించడం వీరికి తమ సిద్ధాంత పుస్తకాల్లోనే ఉందేమో.
అందుకే బెంగాల్ లో వీరు సాగించిన మారణహోమం చూస్తే అర్థం అవుతుంది.. దాదాపు 50 వేలకు పైగా జనాల్ని మట్టుపెట్టి రక్తసిక్త రాజకీయాలు నడిపిన చరిత్ర వీరిది. కేవలం తమతో చేరలేదని సైన్ సోదరులను అతి తీవ్రంగా చంపిన కసాయివాళ్ళు కమ్యూనిస్టులు, తమ తప్పులను చూపడానికి UN నుండి వచ్చిన సభ్యురాలిని మహిళా అన్న కనికరం కూడా లేకుండా నడిరోడ్డుమీద అత్యాచారం చేసి చంపి నగ్నంగా వదిలేసిన సంఘటన అతి సాధారణమైన అంశం అని వీళ్ళ నాయకుడే చెప్పుకోవడం నిజంగా వీళ్ళ నేర ప్రవృత్తిని చూపిస్తుంది…

ఇంతటి మహనీయులు నేడు నీతులు చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు తోస్తుంది.

లాల్ సలాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *