కమ్యూనిజం vs ప్రజాస్వామ్యం

తియాన్మెన్ సంఘటన నేర్పిన పాఠాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా?

కమ్యూనిజం vs ప్రజాస్వామ్యం అనేది చాలా దేశాల్లో జరిగిన యుద్ధమే, కానీ తియాన్మెన్ సంఘటన మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు బలితీసుకున్న మారణఖాండ.

మావో తరువాత చైనా లో ఆర్థిక సమానత్వం నశించడం, ప్రభుత్వం కొద్దిమందికి మాత్రమే జవాబుదారిగా వ్యవహరించడం, 1980 తరువాత జరిగిన ఆర్థిక సంస్కరణలు ఒక నవజాత మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసింది, దీని వల్ల లాభం పొందే ప్రజల శాతం కన్నా నష్టపోయే ప్రజల శాతమే ఎక్కువ. ఏకైక పార్టీగా ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రతిపక్షాలు, ప్రశ్నించే అధికారం లేని పార్టీగా మారడం, నియంతృత్వ పోకడలకు పోవడం, పత్రికా రంగం లో నియంతృత్వం లాంటి అనేక అంశాల వల్ల ఆ దేశ యువత విద్యార్ధులు ప్రజాస్వామ్యం, అధిక జవాబుదారీతనం, పత్రికా స్వేచ్ఛ మరియు వాక్ స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చారు.

గొంతునొక్కడం లో తమదైన శైలిలో వ్యవహరించే కమ్యూనిస్ట్ నేతలకు ఈ విద్యార్థుల, యువత యొక్క ఆకలి సమ్మె దేశవ్యాప్తంగా ప్రదర్శనకారులకు మద్దతు ఇవ్వడం మరియు  నిరసనలు 400 నగరాలకు విస్తరించాయి ఇవి వీరికి చాలా ఆందోళనకరంగా పరిణమించాయి. దీని తీవ్రతను పరిశీలించిన చైనా యొక్క పారామౌంట్ నాయకుడు డెంగ్ జియావోపింగ్ మరియు ఇతర కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ఈ నిరసనలు రాజకీయ ముప్పుగా మారే అవకాశం ఉంది అని అలోచించి ఎలాగైనా వీటిని అణిచివేయ్యకపోతే కమ్యూనిజం ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని , దీని పైన తీవ్రమైన చర్యలు తీసుకునేలా ఆదేశించారు.

దాని ఫలితమే మే 20 న మార్షల్ చట్టం విధించడం, తరువాత దాదాపు 300,000 మంది సైనికులను బీజింగ్ లో తిష్టవేయించారు. ప్రజల్లో ఒకరకమైన భయాందోళనలు సృష్టించడం వల్ల కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అని భావించారు.

కానీ అది నెరవేరలేదు, ప్రజలు వీలైనంతవరకు తమ సరిహద్దుల్లోనే సైనికులను అడ్డుకున్నారు, వారిని ఏమి అనకుండా వారికి భోజనం, నివాసం వంటి అన్నిరకాల సదుపాయాలు అందజేసి వారిని దగ్గరకు రాకుండా చూసుకున్నారు. వారిని తమ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఎక్కడికక్కడ వారిని ఆపేసి విషయంలో మాత్రం గెలుపు సాధించారు. ఆర్మీ కూడా వెనక్కు తగ్గుతున్నట్లు అందరూ భావించారు కానీ అంతిమ సమరానికి అది నాంది అన్నవిషయం ప్రజలు గ్రహించలేకపోయారు

ఈలోపు ఆందోళన జరుపుతున్న విద్యార్థుల శిబిరాల్లోని అంతర్గత సమస్యలు, నాయకత్వలేమి కొద్దిగా వీరిని దెబ్బతీసింది. అదే కాక  తియాన్మెన్ ప్రదేశం కిక్కిరిసి ఉండటం వల్ల, పారిశ్యుద్ద పరమైన సమస్యలతో పాటు, అపరిశుభ్ర వాతావరణం కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువయ్యాయి.

జూన్ మొదటివారానికి కమ్యూనిస్ట్ పోలిట్బ్యూరో ఇక్కడి ప్రజలను అందరినీ తీవ్రవాదులుగా గుర్తించాలంటూ నిర్ణయం తీసుకోవడం మిలిటరీ ఆక్షన్ ద్వారా వారిని అక్కడినుండి ఖాళి చేయించాలని చూడడం ఆర్మీ కూడా సరే అనడం తో దళాలు ముందుకు కదిలాయి.

అత్యంత నాటకీయ పరిస్థితిలో జూన్ 3 నుండి 4 మధ్య సైనిక దళాలు అక్కడికి రావడం, పౌరుల పైన విచక్షణా రహితంగా కాల్పులు జరపడం తో పాటు, ప్రజలమీదకు యుద్ధ ట్యాంకులు నడిపించడం వల్ల దాదాపు 10,000 మంది దాకా ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఇంతమంది చావుకు కారణం కమ్యూనిస్ట్ ప్రభావంతో ఉన్న చైనా లో  ప్రజాస్వామ్యం కోరడం.

చివరికి ఇన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిపేసి శవాలను సైతం మాంసపు ముద్దలుగా మార్చి బుల్డోజర్ లతో ఒక్కచోట పోసి తగలబెట్టిన మహనీయులు ఆ కమ్యూనిస్టులు.

కనీసం ప్రజలు తమ దేశ ప్రజలే అన్న చిన్న అభిమానం కూడా లేకుండా నిరాయుధులను అందునా నిరాహార దీక్ష చేసి ఉన్న విద్యార్థులను సాయుధదళాలతోను, ట్యాంకులతోను గుళ్ళవర్షం కురిపించి తొక్కించి దారుణంగా రక్తపుటేరులు పారించి ప్రజాస్వామ్యాన్ని అలా ఖూనీ చేశారు.

ఇది  తియాన్మెన్ లో ప్రజాస్వామ్యాన్ని తొక్కిచంపిన కమ్యూనిజం

ఒక బాధ్యత గల పౌరుడిగా ఉండే ఏ వ్యక్తి అయినా ఇలాంటి నియంతృత్వ పోకడలకు ఆస్కారం ఇచ్చే కమ్యూనిస్టులతోను, కమ్యూనిజం తోనూ జాగ్రత్త గా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.  వీలైనంతవరకు ఇలాంటివారికి అధికారం ఇవ్వడం అంటే మన వేలితో మన కన్నును పొడుచుకున్నట్లే … తస్మాత్ జాగ్రత్త

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *