మౌలిక సదుపాయాల సమస్య

మా పాలన వస్తే ప్రజలను ఉద్దరించేస్తాం అని చెప్పుకొని, మేము భూస్వాములకు కాదు, పేద వారికే సేవ చెయ్యడానికి పుట్టాము అన్న విధంగా మాట్లాడే వామ పక్షాల నాయకులు, ఇన్నేళ్లు మీరు పరిపాలించిన వెస్ట్ బెంగాల్ అభివృద్ధి ఎలా ఉందొ చూసారు కదా, ఇప్పుడు పరిపాలిస్తున్న కేరళ పరిస్థితి కూడా చూడండి.
ఇప్పటికీ రోడ్లు కూడా సరిగ్గా వేయించాక రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న బాధలు అటు ఏచూరి కి కానీ లేదా ఇటు విజయన్ గారికి మాత్రం పట్టవు..

నిజానికి నా ఉద్దేశ్యం ప్రబుత్వాన్నో, లేక ఆ ప్రభుత్వం నడుపుతున్న నాయకులనో విమర్శించడం కాదు. పాలనావ్యవస్థ మీద పట్టు సాధించడం అంత త్వరగా సార్థకమయ్యే పని కాదు, దానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం అని చెప్పడం మాత్రమే.. (ఇన్నేళ్లు కాంగ్రెస్, కమ్యూనిస్టులు పాలించినా కూడా సమయం సరిపోలేదా అంటే మాత్రం చెప్పేది ఏమి లేదు).

మౌలిక సదుపాయాల సమస్య అన్నది ప్రతి ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యే, ఉచిత తాయిలాల మాటలు పక్కన పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించడం లో శ్రద్ధ చూపితేనే అభివృద్ధి సాధ్యం.

Kerala: Tribal woman in labour carried on sling made of clothes for want of road

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *