పంతమా లేక వామపక్ష ఉగ్రవాదమా

కేరళలో అంతిమయాత్రకు సిద్దమవుతున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం:

శబరిమల విషయంలో, హిందువుల విషయంలో మాత్రమే సుప్రీం నిబంధనలు పాటిస్తాము అన్న విధంగా ప్రవర్తిస్తున్న కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని మిగిలిన విషయాల్లో ఇచ్చిన సుప్రీం తీర్పులను మట్టుకు కాలరాయడానికి వెనుకాడలేదు.
లక్షల మంది రోడ్ల మీద నిరసనలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటీషన్ వెయ్యకుండా తమ పంతం నెగ్గించుకోవాలి అన్న విధంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి చివరికి హిందువుల మీద తమ ద్వేష భావం చూపడంలోనే అసలైన కమ్యూనిజం ఉంది అని చెప్తున్నట్లు అర్థం అవుతుంది.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలను అరెస్టులు చేయడం ద్వారా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మొదలెట్టిన తమ దమనకాండ ఇప్పుడు అసలు శబరిమల ఆలయం హిందువుల సొంత వ్యవహారం కాదు అనే స్థితి కి దిగజారింది

నిజానికి శబరిమల అంశం లో కమ్యూనిస్టుల పట్టు చూస్తుంటే మా ప్రభుత్వ హయాంలో ఏది జరిగినా పర్వాలేదు కానీ మా పంతం మట్టుకు నెరవేరాలి అన్న విధంగా ప్రవర్తించడం చూస్తుంటే ఒక నియంత తన ఇనుప పాదాల కింద అమాయకులను అణిచివేయాలన్న ఉద్దేశ్యమే కనపడుతుంది.

సుప్రీం తీర్పు నచ్చలేదు అన్న దాని మీద నిరసన లక్షల మంది నిరసన తెలిపితే దాన్ని ఏదో పార్టీకో, సంస్థకో అంటగట్టే ప్రయత్నం చేసింది అక్కడి ప్రభుత్వం, అంతేకాని అంతమంది చేసిన నిరసనల మీద రివ్యూ పిటీషన్ వేయాలన్న సంగతి ఆలోచించలేదు.

అసలు భక్తే లేని ఉద్యమకారులు భక్తుల ముసుగులో శబరిమల కు రావడానికి తన పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అక్కడికి పంపి ఎలాగైనా హిందువుల నమ్మకాలను కించపరచాలి అన్న బలమైన ఉద్దేశ్యంతో పనిచేసింది. అడ్డుకున్న భక్తుల మనోభావాలు లెక్కచెయ్యకుండా వారిని బలవంతంగా పంపడానికి ప్రయత్నం చేసి అది విఫలం అవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

ఇక ఆ అడ్డుకున్న భక్తులను, నిరసన తెలియజేసిన భక్తులను కావాలని కుట్ర కేసులో ఇరికించి దాదాపు 4000 మంది హిందువుల మీద కేసులు పెట్టించి తన సహజ సిద్ధాంతమైన “భయపెట్టి/చంపి అయినా కమ్యూనిజాన్ని అలవాటుచేయాలి” దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విఫల ప్రయత్నం చేసింది.

ఈ విషయం మీద మీడియా లో తీవ్ర స్థాయి లో విమర్శలు వచ్చేసరికి ఒకానొక సమయంలో మీడియా ని సైతం తొక్కిపెట్టాలని అనుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంత చేసినా అక్కడి హిందువులంతా సమన్వయంతో ఉండటం మింగుడు పడనీ విషయంగా మారింది వారికి, ఈ సారి కొత్తగా ఆలోచన చెయ్యాలని ప్రయత్నం చెయ్యడం మొదలెట్టారు.

ఈ సారి హెలిక్యాప్టర్లలో లో మహిళలను తరలించాలి అనే నిర్ణయం కోసం ఆలోచన చెయ్యడం చూస్తుంటే ఇక్కడ సుప్రీం తీర్పు అమలు చెయ్యడం కంటే ఎక్కువగా తమ వామపక్ష తీవ్రవాద ధోరణిలో అక్కడి భక్తుల మనోభావాలను, నమ్మకాలను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. ఇంతగా పట్టుబట్టి వీళ్ళు అక్కడికి తీసుకువచ్చే భక్తులు (వాళ్ళను భక్తులు అనొచ్చా ఎందుకంటే అయ్యప్ప స్వామి మీద అంత నమ్మకం ఉంటే, ఆలయ ఆగమ నియమాలు కూడా పాటిస్తారు కాబట్టి ) అభ్యుదయవాదం పేరుతో వచ్చే వాళ్ళే ఉంటారు కానీ నిజమైన భక్తులు అయితే అయ్యుండరు.

ఒకప్పుడు తీవ్ర వర్షాలతో శబరిమల కొండలు స్వాములు వెళ్ళడానికి ఇబ్బంది పడినా కూడా ఎలాంటి ఏర్పాట్లు చెయ్యని ఈ వామపక్ష ప్రభుత్వం ఇప్పుడు పంతం కోసం ప్రజల సొమ్ముతో అభ్యుదయవాదులను వాయు మార్గంలో తరలించడం చూస్తుంటే పంతం కోసం ప్రజల సొమ్మే కాదు, వారి ప్రాణాలను సైతం హరించాలి అని చెప్పే కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండ పాటిస్తున్నట్లు అనిపిస్తుంది. దీనికి కూడా ఏదైనా అడ్డు తగులుతుందేమో అని భావించి పైత్యం ఇంకా ఎక్కువ చూపించడం మొదలెట్టింది.

విగ్రహారాధన ను నమ్మని ముస్లిం, క్రైస్తవ మతాల తో కూడా చర్చించి దీని మీద ఒక నిర్ణయానికి వస్తామని చెప్పడం చూస్తుంటే వీరి ఉద్దేశ్యం దేవసం బోర్డును అక్కడ స్థిరపరచాలి అనుకోవడమేనా.
నిజానికి చాలా దేవాలయాల్లో అన్యమతస్థులకు కూడా ప్రవేశం ఉంది, దానికి ముందు అక్కడ వారు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి భక్తితో వెళ్తున్నాను అని రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నింటిలో ఇలాంటి నియమం కూడా ఏమి లేదు. ఇక్కడ శబరిమల అంశం లో నాకు తెలిసి ఏ ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ అభ్యన్తరం చెప్పే అవకాశమే లేదు. ఎందుకంటే ఇది వారికి సంబంధం లేని, అవసరం లేని అంశం.
కానీ ఇక్కడి ప్రభుత్వం ఇలాంటి అంశం లేవనెత్తడం చూస్తుంటే కావాలని ఇక్కడ పంతం నెగ్గించుకోవడం కోసం తాము ఎంతకైనా దిగజారిమరీ చూపిస్తాము అని చెప్పడం లా ఉంది.

అసలైన అయ్యప్ప స్వామి భక్తులు ఎవరు కూడా ఆలయ ఆగమ శాస్త్ర నియమాలు దాటి వెళ్లరు అందులో అనుమానం లేదు. కానీ ఈ వామపక్ష ప్రభుత్వం తమ సార్థకనామధేయమైన వామపక్ష ఉగ్రవాదం నిలబెట్టుకునేలా ఉంది..

ఇలా పంతం నెగ్గించుకోవడం కోసమో లేక సంతుష్టీకరణ కోసమో చేసే పనులు మన మనుగడకు ముప్పు తెస్తాయేమో అన్న అనుమానం ఈ వామపక్ష వాదులకు రాకపోవడం ఆశ్చర్యకరమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *