లెనిన్ విగ్రహాల కూల్చివేత … 

వ్యక్తిపూజ కు వ్యతిరేకమని చెప్పుకునే మార్క్స్ సిద్ధాంతం ఫాలో అవుతామని చెప్పుకునే కమ్యూనిస్టులు కూడా వ్యక్తిపూజ కే అంకితమయ్యారు అనుకోవాలా, లేక ఒక నాయకుని విగ్రహానికి జరిగే సన్మానాలకంటే అవమానాలే ఎక్కువ ఉంటాయి అనుకోవాలా
విగ్రహాలు పెట్టడం వెనుక ఉన్న సొంత లాభం  ఏమిటో తెలిస్తే ఆ ఘటనని సమర్థించడమో, లేక వ్యతిరేకించడమే చెయ్యొచ్చు. అలా అని వ్యతిరేకించే వాదం కానీ సమర్థించే వాదం కానీ చెయ్యట్లేదు, మొత్తం చదివి అప్పుడు అభిప్రాయం చెప్పండి
నిజానికి ఈ విగ్రహాల కూల్చివేత ఇప్పటిది కాదు, తమకు నచ్చినవాడికి విగ్రహాలు పెట్టడం, నచ్చని వాడి విగ్రహాలు కూల్చడం అనాదిగా వస్తున్న విషయమే. కాకపోతే ఏది చేసినా ప్రజాస్వామ్య బద్దంగా చెయ్యడం లోనే లోగుట్టు దాగుంది.
ఉక్రెయిన్ మొత్తం లో దాదాపు అన్ని లెనిన్ విగ్రహాలు జాతీయ వాద  ప్రజల ఆగ్రహాన్ని చవిచూశాయి, నరహంతకుడు అన్న నినాదాల మధ్య అనేక విగ్రహాలు ప్రజలు కూల్చివేశారు, కారణాలు ఒకటి అని చెప్పలేము, సోవియట్ యూనియన్ పతనం తరువాత ప్రజల్లో స్వాతంత్ర్యభావాలు విరిసి అప్పటివరకు ఏ సిద్ధాంతాలవల్ల తాము బాధలు పడ్డారో అలాంటి సిద్ధాంతాలను పాటిస్తూ వచ్చాడు అన్న కారణంతో నో లేక ఆయన చేసిన పనుల వల్లో కానీ లెనిన్ విగ్రహాలు కూల్చేశారు అక్కడి ప్రజలు.
ఇప్పుడు ఆ జాతీయవాద ఉక్రెయిన్ ప్రజలను ఏమని అందాం, విద్వాంసకారులందామా లేక ప్రజా వ్యతిరేక  సిద్ధాంత వైరుధ్యాలను ఒప్పుకొని వారందామా ?
అంతెందుకు మొన్నటికి మొన్న ప్రజాగ్రహం, ప్రభుత్వ సహకారంతో సద్దాం హుస్సేన్ విగ్రహాలు ఘటనలు కూడా చూసాము, ఇది నిజంగా కేవలం  ప్రభుత్వ సహకారం తోనే కూల్చబడ్డాయి  అని కూడా చెప్పలేము, ప్రజల అభిప్రాయలు అప్పటివరకు భయంతో అణచుకున్న అగ్రహాలు ఒక్కసారి వెల్లువలా బయటపడి వీటిని కూల్చే పనికి ఉసిగొల్పిఉండొచ్చు. ఈ విషయంలో ప్రబుత్వాన్నో లేక స్థానిక అధికారులనో లేదా ఏ ఒక్కరినో  నిందించడం అంటే అది కేవలం పక్షపాతం అవుతుంది.
వీరినేమందాం ఇప్పుడు ?
సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్న ఆంధ్రా ప్రాంత మహనీయుల విగ్రహాలు కూడా కూల్చారు ఇక్కడి తెలంగాణా వారు, అది ఎదో కుట్ర పూరితంగా చేసిన చర్య కాదు, ప్రజల్లో ఆ సమయంలో  పెల్లుబుక్కిన ఆగ్రహం అది, వారి ఆత్మగౌరవానికి అసెంబ్లీ లో జరిగిన అవమానం తాలూకు ఫలితం ఆలా చెయ్యడానికి పురి గొల్పింది, అంతేకాని కుట్ర పూరిత చర్య కాదు.
తెలంగాణా ప్రజలను ఏమని అందాం ఇప్పుడు ?
ఇంకా చెప్పాలంటే మాయావతి విగ్రహాల పుట్టల గురించి చెప్పుకోవడం కొద్దిగా కష్టమే అయినా, బ్రతికి ఉండగానే విగ్రహాలు పెట్టించుకోవడం అది కూడా ప్రజల సొమ్ముతోటి అంటే ఎంత స్వలాభం, ఆత్మస్తుతి దాగివుందో చెప్పాల్సి వస్తుంది.. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వమో లేక ఆమె ఓడిపోయాక ప్రజలలో అప్పటివరకు ఆమె మీద ఉన్న కోపాన్నో లేక ప్రేమనో ఆ విగ్రహాల మీద చూపిస్తే…
వాళ్ళను ఏమని అందాం మరి ?
ఇప్పుడు త్రిపుర లో జరిగిన లెనిన్ విగ్రహ కూల్చివేత కూడా అలాంటిదే, లెనిన్ ని దాదాపు స్వదేశంలోనే నరహంతకుడిగా చెప్పి కూల్చివెయ్యబడిన విగ్రహాలు కేవలం ఒక పార్టీ సిద్ధాంతాల కోసం ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో ప్రతిష్టించడం అంటే , ఆ నరహంతక విధానాలను ప్రోత్సహించమే అవుతుంది, విద్యార్థులు వారి వారి చదువుల విషయం మర్చిపోయి వారి జీవితాలను అవకాశవాదుల వెనుక నడిపించడం జరుగుతుంది.
ఇక్కడ లెనిన్ విగ్రహం పెట్టడం వెనుక ఎలాంటి సిద్ధాంతాలు ఉన్నాయో దాన్ని కూల్చడం వెనుక కూడా అలాంటి సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయని అనుకోవచ్చు.
చివరగా ఒక్క మాట విగ్రహాలు కూల్చడమన్నది అప్పటి ప్రజల మానసిక పరిస్థితి ని బట్టి, తమకు అంతకుముందు  కలిగిన అసౌకర్యాల విషయాన్నీ బట్టి , పాలక వర్గం మారినప్పుడు అంతకు ముందు  ఉన్న పాలకవర్గం పైన ఉన్న వ్యతిరేకతను బట్టి, ఆ విగ్రహంలోని వ్యక్తి చరిత్రను బట్టి ఉంటుంది తప్ప కుట్ర పూరితాలు అంటూ ఏమి ఉండకపోవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *