ప్రపంచ మలేరియా దినోత్సవం

అసలు ఇది జరుపుకోడానికి ముఖ్య కారణం మలేరియా గురించి, దోమ కాటువల్ల జరిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం. ప్రపంచ దేశాలన్నింటిలో ఒకప్పటి అతి పెద్ద మహమ్మారి ఈ మలేరియా, ఇది వాతావరణ పరిస్థితులను బట్టి ప్రబలే వ్యాధి.
ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా అతి వేగంగా వ్యాప్తి చెందే ఈ వ్యాధి కి ప్రపంచ దేశాలన్నీ ఒకప్పుడు గజగజలాడిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యాధి దాదాపు ప్రపంచ దేశాలన్నింటిలో ఉంది, ఏటా దాదాపు 4 లక్షల మంది ఈ దోమ కాటు వల్ల , వివిధ వ్యాధులు వ్యాప్తి చెందడం వల్ల మరణిస్తున్నారు. ఇది అందరూ ఆందోళన చెందాల్సిన విషయం. ఈ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన సేవలు కానివ్వండి, అందించిన ప్రోత్సాహం గణనీయమైన మార్పులు సాధించింది అన్నది సత్యం.
నేటికీ ప్రపంచ దేశాలలో మలేరియా వ్యాప్తికి ఆఫ్రికా తరువాత మన దేశం రెండవ స్థానంలో ఉండటం ఇంకా కొద్దిగా ఆందోళన చెందాల్సిన విషయమే అయినా కూడా, ప్రజల్లో పెరుగుతున్న అవగాహన వల్ల దాదాపు ఈ వ్యాధి వ్యాప్తి బాగానే తగ్గుముఖం పట్టింది అన్నది మంచి విషయమే.
ప్రతి ఏడాది మలేరియా వ్యాప్తికోసం ఒక థీమ్ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా అలాంటి మరో థీమ్ తో ముందుకు వచ్చింది WHO. “రెడీ టు బీట్ మలేరియా ” అనే నినాదంతో ముందుకు వచ్చింది. ప్రపంచ దేశాలన్నింటిలో నుండి ఔత్సాహిక స్వచ్చంధ సంస్థల సహకారంతో ఈ నినాదం తో ముందుకు వెళ్తూ , మలేరియా లేని ప్రపంచం దిశగా అడుగులు వెయ్యడానికి సాగుతుంది.
2017 మలేరియా డే తరువాత మంచి ప్రగతి సాధించిన ఈ అవగాహనా శిబిరాలు , ఇప్పుడు ఒకింత స్తబ్దత కు లోనుకావడం కొంచం నిరుత్సాహపరిచే విషయమే.   వీటిని తిరిగి చైతన్యపరిచి ప్రపంచం లో మలేరియా ని తరిమేసే విధంగా ఈ ఏడాది థీమ్ ఉంది.
అసలు ఈ మలేరియా వ్యాధి సంగతి ఏంటో చూద్దాం
1. ప్రపంచంలో దాదాపు 109 దేశాల్లో ఈ వ్యాధి ప్రబలి ఉంది. ఇంకా చెప్పాలంటే ఏటా దాదాపు 3.3 బిలియన్ల మందిని వివిధ రకాల వ్యాధులకు లోనయ్యేలా తోడ్పడుతుంది ఇది
2. శ్రీలంక ఇప్పటికే మలేరియా లేని దేశంగా 2016 లోనే అవతరించింది, మనదేశం పెట్టుకున్న గోల్ మాత్రం 2030 వరకు
3. మనదేశం ఈ గోల్ సాధించడానికి దాదాపు 18 బిలియన్ డాలర్ల నిధులు కావాలి
4. ప్రపంచం మొత్తం మీద 6 శాతం మలేరియా కేసులు మన దేశములో నమోదు అవుతున్నాయి, ఒక సౌత్ ఈస్ట్ ఆసియ లోని కేసులను బట్టి చూస్తే  దాదాపు 75 శాతం గా ఈ రేట్ ఉంది
5. దాదాపు 90 శాతం మంది కి మన దేశంలో మలేరియా సోకె అవకాశం ఉంది, అదే నేపాల్ లో అయితే 48% మరియు బంగ్లాదేశ్ లో అయితే 11% గా ఉంది.
దీని బారిన పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.
వాతావరణ పరిస్థితులను బట్టి మనదేశంలో దాడ్పు మే నుండి మొదలుకొని అక్టోబర్ వరకు మలేరియా ప్రబలే అవకాశాలున్న సీజన్ గా పరిగణిస్తారు డాక్టర్స్.
 – శరీరం మొత్తం కవర్ చేసేలా దుస్తులు ధరించడం మంచిది. వదులుగా ఉండే దుస్తులైతే మరీ మంచిది
– వీలైనంతవరకు ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవడం ముఖ్యం, వీలైతే దోమల వలలు కిటికీలకు, డోర్ లకు అమర్చుకోవడం మంచిది.
 – నీళ్లు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాలు, పాత టైర్లు, పక్షుల గూళ్ళు, కుండలు ఇలాంటి వాటి మీద దోమలు ఎక్కువగా తమ సంతతి పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి, వీలైతే వాటిని తొలగించండి
– దోమల మందులు, దోమలను సంహరించే బ్యాట్ లు, దోమ తెరలు వాడితే దాదాపు 80% వరకు వీటి బారిన పడే అవకాశం లేదు.
సాధ్యమైనంత వరకు దోమల బారిన పడకుండా చూసుకోండి, మలేరియా నుండి బయట పడండి, దేశం నుండి మలేరియా ని తరిమి కొట్టండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *