అవయవ దోపిడీ కేరాఫ్ చైనా

ప్రపంచం మొత్తం మీద ఎవ్వరికైనా అవయవమార్పిడి అవసరం అయితే ఆయా దేశాల్లోని అవయవ మార్పిడి సంస్థల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగి క్షతగాత్రుడు ఇక కోలుకోలేడు, జీవన్మృతుడు అయ్యాడు అని భావించినప్పుడు వైద్యుల, చట్టబద్దమైన పర్యవేక్షణలో వారి శరీరం నుండి ఆ అవయవాలు తొలగించి పైన పేర్కొన్న సంస్థల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి అవసరాన్ని బట్టి ఇస్తారు.
ఎక్కడైనా ఇదే పద్ధతి జరుగుతుంది.. కానీ మీకు అత్యవసరంగా, త్వరగా అవయవ మార్పిడులు జరగాలంటే, మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే చాలు చైనా వెళ్ళిపోండి, అక్కడ త్వరితగతిన అవయవాలు దొరుకుతాయి, అవసరమైతే బ్రతికున్న మనుషుల శరీరాల నుండి కూడా అవసరమైన అవయవాలు తీసేసి మీకు ఇచ్చేస్తారు.

ప్రపంచం లో అత్యధిక అవయవమార్పిడి సర్జరీ లు జరిగేది చైనా లోనే, సంవత్సరానికి దాదాపు ఒక లక్ష అవయవమార్పిడి సర్జరీ లు అక్కడ జరుగుతున్నాయి అంటే అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత విరివిగా అవి లభిస్తున్నాయో. కానీ ఇంత విరివిగా అవయవాలు చైనా లో లభించడానికి కారణం ఏమిటి, అక్కడ ఏవైనా అవయవ తయారీ రంగం ఏదైనా ఉంది అనుకుంటున్నారా… లేదు .. మరి వీరికి ఇలా ఎలా సాధ్యం అవుతుంది.

అవయవాలు కావాలంటే జీవన్మృతులు గా ఉండిపోయిన వ్యక్తుల నుండి వాటిని వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు సేకరించడం, ఆ లెక్కన చూస్తే చైనా లో జీవన్మృతులుగా మారే వారి సంఖ్య కు వీరు చేస్తున్న అవయవ మార్పిడి ప్రక్రియలకు ఎక్కడా పొంతన కుదరదు, కారణం వీరు సేకరిస్తున్న అవయవాలు జీవన్మృతుల నుండి మాత్రమే కాదు, రాజకీయ ఖైదీల నుండి కూడా (ఆరోగ్యంగా ఉన్నవారు).

రాజకీయ ఖైదీలను బ్రతికిఉండగానే వారి శరీరం నుండి అవయవాలు సేకరించే అమానుష చర్యకు పాల్పడుతున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కలవారు అక్కడ ఎవ్వరూ లేరు. ఈ అమానుష చర్యను చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోతున్నా కూడా మాట్లాడలేని పరిస్థితి, మానవహక్కులు కాలరాచే ధోరణి లో జరుగుతున్న ఈ అమానుష చర్యలు బయటపడింది 2006 లో దాదాపు 1990 నుండి సాగుతున్న ఈ దురాగతాలు 2006 దాకా బయటపడకపోవడానికి కారణం అక్కడి మీడియా ను సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకొని నడుపుతున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వమే. ఇందులో ఎక్కువగా బలి అయ్యేది అక్కడి “ఫలూన్‌ గ్యాంగ్” లోని రాజకీయ ఖైదీలే.

ఫలూన్‌ గ్యాంగ్ అంటే ?
ఫలూన్‌ గ్యాంగ్ అనేది 1992 లో లీహోంగ్జీ ద్వారా స్థాపించబడిన ఒక బౌద్ధ వర్గమే. వీరు శాంతియుత మార్గంలో ప్రయాణించేవారు, యోగా మరియు నృత్యం వీరి ముఖ్య సాధనాలు. వీరిని అప్పట్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వమే తన అవసరాల కోసం ప్రోత్సహించింది. స్థాపించబడిన అతిత్వరలో లోనే ఈ ఫలూన్‌ గ్యాంగ్ చాలామంది ని ఆకర్షించింది. అప్పటినుండి ఇందులో చేరేవారి సంఖ్య పెరిగిపోతుండం తో కన్ను కుట్టిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం వీరిని ఏరివేయడానికి ప్రయత్నాలు సాగించింది.

ఇందులో చాలామందిని రాజకీయ బందీలుగా పట్టుకొని వారిని తమ ఆధీనంలో ఉంచుకున్నది, ఇప్పుడు ఎవరైనా కమ్యూనిస్ట్ నాయకులకు కానీ, సంపన్న వర్గాలకు కానీ అవయవాలు కావాల్సి వస్తే వాటిని ఈ వ్యక్తుల నుండి బ్రతికి ఉండగానే సేకరించేవారు.
కొన్ని వేలమంది రాజకీయ ఖైదీల నుంచి అవయవాలను వేరు చేసిన ఎన్వార్‌ థోటీ అనే ఓ డాక్టర్ ఇటీవల దీనిపై స్పందించారు. ‘ఓరోజు ఆపరేషన్ థియేటర్ గదిలోకి ఓ సాయుధుడు వచ్చాడు. మేం బయట నిలబడ్డాం. గది నుంచి తుపాకీ పేలిన చప్పుడు. లోపలికి రమ్మని సైగ చేయగానే వెళ్లాం. గుండెపై బుల్లెట్ గాయంతో ఖైదీ విలవిల్లాడుతూ కిందపడి ఉండటం చూశాం. అతని ‘కిడ్నీ, లివర్’ తీయండి.. అని ఆ సాయుధుడి నుంచి ఆదేశం. అప్పటికీ ఆ ఖైదీ కదులుతున్నాడు. మనసు చివుక్కుమన్నా తప్పలేదు. అతని శరీరం నుంచి అవయవాలు బయటకు తీశాం. అలాంటివి కొన్ని వేలసార్లు చేయాల్సి వచ్చింది.’ అని చెప్పుకొచ్చారు.

ఈ డాక్టర్ ఈ విషయాలు బయటపెట్టనంతవరకు దాదాపు మీడియా కూడా మిన్నకుండినది అంటే అక్కడి ప్రభుత్వం ఎంత నిర్దయగా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
నియంతృత్వం, రక్తపిపాస గుణాలు, దయలేని గుణం, బూర్జువాలను వ్యతిరేకించి తామే బూర్జువాలుగా మారిపోవడం నేటి కమ్యూనిజం, మొన్నటి జిన్ పింగ్ నియంతృత్వ ఎన్నిక కూడా ఇదే చెప్తుంది.
మన దగ్గర కూడా కమ్యూనిస్టులు ఇంకా అలాంటి ప్రవర్తన తోనే సాగుతున్నారు అన్నది స్పష్టం. ఎందుకంటే వారి ఛైర్మెన్ ఎప్పటికైనా చైనా ఛైర్మెన్ అన్నది వారే స్పష్టంగా రాసుకున్న నినాదాలు.

సో ఇప్పటికైనా కొందరు కమ్యూనిజాన్ని ఎదో నిజం ఉంది అని నమ్మేవాళ్ళు ఒకసారి తమ కళ్ళు తెరిచి చూస్తే ఈ విషయాలు బయటపడతాయి.

జాగ్రత్త కామ్రేడ్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *