లక్షల్లో ఫీజులు, నేల బారు చదువులు

కూరగాయల రేట్లు కొంచం పెరిగితే మనం గీచి గీచి బేరమాడుతాం.. అలాంటిది కేవలం 4 వ తరగతి చదివే పిల్లల పుస్తాకాల ఖరీదు దాదాపు 7,600/- రూపాయలు.
దీని గురించి యాజమాన్యాలను ఎందుకు గట్టిగా నిలదీయలేకపోతున్నాము, తల్లితండ్రులు అందరూ కలిసి నిలదీస్తే స్కూల్ యాజమాన్యాలు ఇంతటి ఖరీదు వసూలు చేస్తాయా..
నిజానికి స్టేట్ సిలబస్ అయినా కానీ కేంద్ర సిలబస్ అయినా కానీ 4 వ తరగతి పిల్లల పుస్తకాల ఖరీదు 1000/- రూపాయలకు మించదు. అలాంటిది మనం ఇక్కడ ఇంత డబ్బులు కట్టి వారి వారి సొంత పుస్తకాలు కొనడం ఎంతవరకు సమంజసం.

నిజానికి ఇది కేవలం ఈ ఒక్క స్కూల్ తో ఉన్న సమస్య కాదు, అన్ని రకాల కార్పొరేట్ స్కూల్స్ లో ఉన్న సమస్యే ఇది.. దీనిని ప్రభుత్వం ఎలాగూ ఏమి చేయలేకపోతోంది. కనీసం తల్లితండ్రులు అయినా ఒకటై నిలదీస్తే మార్పు రాదంటారా …

ఆలోచించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *