ప్రత్యేకహోదా vs రాజకీయం

 

ప్రత్యేకహోదా విషయం, ఇప్పుడు కేవలం రాజకీయం మాత్రమే
నిజంగా హోదా రావాలని నాకు కూడా ఉంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు, ఉపాధి దొరికే అంశాలు చాలానే ఉంటాయి కాబట్టి.

కానీ లెట్స్ బీ లాజికల్… హోదా ఇవ్వాలంటే అడ్డుపడుతున్న అంశాలు ఏమిటి. ఈ కేంద్రప్రభుత్వం కానీ, లేదా వచ్చే ఏదైనా ప్రభుత్వం కానివ్వండి…
ముందు ప్రత్యేక హోదా అనేది ఏ రాష్ట్రానికైనా ఏ పరిస్థితులను బట్టి ఇస్తారు అన్నది చూడాలి:

నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇచ్చే మార్గదర్శాల ఆధారంగా ఎలాంటి అభివృద్ధి జరగదు అని అనిపించిన రాష్ట్రం, ఎక్కువగా కొండచరియలు, నివాస, వ్యవసాయ పనులు జరిగే అవకాశం లేనివి ఇలా భౌగోళికంగా కొన్ని అంశాల మీద ఆధారపడి అది ఇస్తారు. తక్కువ జనసాంద్రత ఉండి పూర్తిగా వెనుకబడిన ప్రజలు ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం ఉంది. పారిశ్రామికంగా అస్సలు అభివృద్ధి జరగదు అన్న అంశం కూడా ఒకటి అందులో ఉంది. చివరగా దాదాపు వేరే దేశాలతోటి సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలకు కూడా ఇచ్చే అవకాశం ఉంది.

పైన చెప్పిన ఒకే ఒక్క అంశం లో తప్ప మిగిలిన ఏ అంశం లోను ఏపీ పరిస్థితి సానుకూలంగా లేదు
పాత ప్రభుత్వం ఇస్తానని చెప్పింది అంటే, అది నెక్స్ట్ టైం ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఆశపడింది, ఆ ఆశ తోనే అది విపరీత వాగ్ధానాలు చేసింది, పోటాపోటీగా బీజేపీ కూడా 5 కాదు 10 అని వాగ్ధానాలు చేసింది. కానీ అది ఆచరణ సాధ్యం కాదు అని రెండు పార్టీలకు కూడా తెలుసు.
కేవలం ఆదాయం అధికంగా వచ్చే హైద్రాబాద్ దూరం అయ్యింది అన్న ఒకేఒక్క కారణంతో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు కాబట్టి రెండు ప్రభుత్వాలు
ప్రత్యేక తాయిలం అంటూ మభ్యపెట్టాయి.

Low resource base, hilly & difficult terrain – తక్కువ వనరులు ఉన్న ప్రాంతం, ఎక్కువగా కొండలు, గుట్టలు ఉండి వ్యవసాయానికి, నివాసానికి ఆమోదయోగ్యం గా ఉండని ప్రదేశాలు
Low population density or sizeable share of tribal population తక్కువ జనసాంద్రత కలిగి ఉండటం లేదా గణనీయమైన గిరిజన జనాభా
Backwardness, border states/ sharing the international border – వెనుకబాటుతనం, వేరే దేశాల సరిహద్దులను కలిగి ఉండటం
Economic & infrastructural backwardness – ఆర్ధిక, మౌలికమైన వెనుకబాటుతనం లో ఉండటం
Non-viable nature of state finances – అభివృద్ధికి నోచుకోలేని స్థితి లో ఆర్ధిక పరిస్థితి ఉండటం

ఇందులో ఆర్థికపరమైన అంశంలో తప్ప ఏపీ ఎందులోనూ ఆమోదయోగ్యంగా ఉండదు. నిజానికి ఈ విషయాలు అన్ని పార్టీలకు అప్పుడు, ఇప్పుడు కూడా తెలుసు కాకపోతే కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఈ ప్రత్యేకహోదా అంశాన్ని అప్పట్లో కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది, దానికి బీజేపీ వంతపాడింది.

అంతేతప్ప అది వచ్చేస్తుంది అని మాత్రం కాదు విభజన చట్టం లో చేసింది కదా అని ప్రశ్న వేసినా కూడా విభజన చట్టంలోని అంశాన్ని, రాష్ట్ర ప్రాథమిక అర్హతలు అనే అంశం ఓవర్ రైడ్ చేస్తుంది. సో అప్పుడు ఈ చట్టం లోని అంశం పనికిరాదు.

ఇప్పటికీ కూడా కొన్ని పార్టీలు హోదా సాధిస్తాం అని చెపుతున్న మాటలు కానీ, ఇస్తామని చెప్తున్న మాటలు కానీ వాస్తవ దూరాలే. వోట్ బ్యాంకు రాజకీయాలు గానే పరిగణించాల్సి వస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పిన పార్టీ ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్రాల మధ్య ప్రత్యేక హోదా పోటీ మట్టుకు పెరిగే అవకాశం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *